కామారెడ్డి జిల్లా రాజాంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆదివారం హిందీ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీవాణి మాట్లాడుతూ.. హిందీ భాష రాజభాషగా గుర్తింపు పొందిందని, ప్రతి విద్యార్థి హింది భాష నేర్చుకోవాలని సూచించారు. అనంతరం హిందీ అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.