ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని చౌటపాలెం రోడ్డులో గల ఆర్ అండ్ బి బంగ్లా వద్ద స్త్రీ శక్తి పథకంతో మహిళా సాధికారత విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలోని మహిళలు కూటమి శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.