ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా తరలి వెళ్లినట్లు వారు తెలిపారు. అన్నదాతకు అండగా నిలబడేందుకు, ఎరువులను వారికి సకాలంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి కోరారు.