కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఛైర్మన్ పదవి వైశ్యులకే కేటాయించాలని శ్రీపాద శ్రీ వల్లభఫౌండర్స్ సభ్యులు డిమాండ్ చేశారు. పాలకవర్గంలో సభ్యులుగా అయినా సరే నియమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. మహా సంస్థానాన్ని పూర్వవైభవానికి తీసుకురావడానికి కృషి చేస్తామని, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని ఫౌండర్స్ వీర్రాజు, శ్రీరామ్మూర్తి బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడారు.