వికారాబాద్ జిల్లా దారులు మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలంటూ విరుద్ధంగా దున్నపోతును రోడ్డుపై ఉంచి నడిరోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందు పాల్గొని నిరసన తెలుపగా వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు ఎంత మొత్తుకున్న దున్నపోతు మీద వాన పడ్డ విధంగా కూడా ప్రభుత్వానికి కావడంలేదని వెంటనే సరైన యూరియా అందించాలని డిమాండ్ చేశారు.