వెంకటాచలం మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. వెంకటాచలం ఇస్కపాళెం గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు శివారెడ్డికి చెందిన గడ్డివాము అగ్నిప్రమాదానికి గురి కావడంతో, సంఘటన స్థలాన్ని పరిశీలించి, అగ్ని ప్రమాద వివరాలు, జరిగిన నష్టాన్ని అడిగితెలుసుకున్నారు. అధైర్య పడద్దని పార్టీ తరపున అండగా ఉంటామని కాకాని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా తొమ్మిదో తేదీ నిర్వహించే అన్నదాతకు అండగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.