ప్రభుత్వ భూముల వివరాలను సిద్ధం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సూపరింటెండెంట్ పి. శ్రీనివాస్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. భూముల వివరాలతో పాటు నీటి పన్నుల వివరాలు కూడా సేకరించాలని ఆదేశించారు. సంబంధిత నివేదికలను త్వరితగతిన అందించాలని వివరించారు. కార్యక్రమంలో వీఆర్వోలు పాల్గొన్నారు.