రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పుట్టపర్తిలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు.