వెంకటాపూర్ (మం) లక్ష్మీదేవిపేట గ్రామంలో దుర్గం అశోక్ (40) మృతి చెందిన కేసును 48 గంటలలో పోలీసులు చేధించారు. మద్యానికి బానిసై ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ డబ్బులు పోగొట్టుకున్న అశోక్ తరచూ తల్లితండ్రులతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో కోపం పెంచుకున్న తండ్రి సూరయ్య తన ఇద్దరు కుమారులు సంపత్, సారయ్య లతో కలిసి అశోక్ మెడకు ఉరి వేసి హత్య చేసి, ఆపై కార్ డ్రైవర్ తీగల రమేశ్ సహాయంతో తన ఇంట్లో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనంతరం నేడు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ములుగు సిఐ ముందు లొంగిపోయారు.