అనంతపురం నగర పరిధిలోని శివకోటి ఆలయం సమీపంలో 60 బాటిల్ల డిఫెన్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఓబుల నారాయణరెడ్డి కర్ణాటక నుంచి డిఫెన్స్ మద్యాన్ని తీసుకువచ్చి దసరా పండుగ సందర్భంగా విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో 60 బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులను చూసిన సాకే పవన్ కుమార్ వడ్డే శ్రీనివాసులు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.