సింగరాయకొండ అంబేడ్కర్ నగర్ లో ఈనెల 23న జరిగిన సుబ్బాయమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మమత, మాధురి అనే ఇద్దరు మహిళలు సుబ్బాయమ్మ వద్ద రూ. 1.30 లక్షలు తీసుకున్నారు. డబ్బులు వసూలు చేసే సమయంలో సుబ్బాయమ్మ వారిని వేధించడంతో, మమత సీరియల్స్ చూసి హత్యకు పథకం రచించింది. పాయసంలో మాత్రలు కలిపి సుబ్బాయమ్మకు ఇవ్వగా, స్పృహ తప్పిన తర్వాత మాధురి, మమత కుమారుడు కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.