రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కాపు సంఘం నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా కి వంగవీటి మోహన్రంగా పేరు పెట్టాలని అంశంపై కాపు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులతో చర్చించామన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ మేరకు వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కాపులంతా ఏకమై ప్రభుత్వానికి వినతి పత్రం అందించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు