సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో అమావాస్య సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు భస్మాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు శివ పంచాక్షరి నామాన్ని జపించారు.