రుద్రూర్ మండల కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టదలచిన అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రుద్రూర్ ఎంపీడీవో భీమ్ రావు భూమి పూజ చేశారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్టు ఎంపీడీవో వెల్లడించారు. కోటగిరి మండల కేంద్రంలో గేదెల షెడ్డు నిర్మాణానికి ఎంపీడీవో భూమి పూజ చేశారు.