మచిలీపట్నంలో తెలంగాణ మంత్రికి ఘన స్వాగతం తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంగళవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో స్తానిక మచిలీపట్నంలో ఘన స్వాగతం లభించింది. చల్లపల్లిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఆయన బేగంపేట నుంచి హెలికాప్టర్లో మచిలీపట్నంలోని నేషనల్ కాలేజ్ కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద అవనిగడ్డ MLA మండలి బుద్ధప్రసాద్, ఆర్డీఓ స్వాతి, తదితరులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మర్గాన మంత్రి అవనిగడ్డ బయల్దేరి వెళ్లారు.