అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లోని రైతు సేవా కేంద్రంలో శనివారం ఉదయం యూరియా పంపిణీ కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ అధికారులు కలిమున్నీసా, నాగేంద్ర ప్రసాద్ లు తెలిపారు. యూరియా పంపిణీ వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. అందుకు మండలంలోని రైతులు సహకరించాలని కోరారు. ఒక్కొక్క రైతు సేవ కేంద్రంలో 590 బ్యాగుల యూరియాను అందుబాటులో ఉంచినట్లు వారు వెల్లడించారు