రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యాన్ ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీకృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు అలాగే మరో యువకుడు హరీష్లు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలింపబడ్డారు. కాగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో వారు ఇరువురు మరణించినట్లు ఆరిలోవ ఎస్సై వై కృష్ణ తెలియజేశారు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించినట్లు వెల్లడించారు.