నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవార్ పేట్ కాలనీలో హిమాలయ గణేష్ మండపం నుండి వంజరి సంఘం వరకు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. కాలనీకి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ నరేందర్ విద్యుత్ అధికారులతో మాట్లాడి ఆదివారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. గత కొన్నేళ్ళుగా వినాయక నిమజ్జనం సమయంలో ఇబ్బందులు ఉండేవని నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో ఆ సమస్య పరిష్కారమైందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.