కడెం మండల రైతులు యూరియా కోసం నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై శనివారం ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగ రైతులు మాట్లాడుతూ కడెం మండలంలో యూరియా కొరత ఉండడంతో పొలాలను వదిలేసి ఆఫీసుల చుట్టూ యూరియా కోసం తిరుగుతూ ఉంటే మా పొలాలు నాశనమైతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశరు. యూరియా లేక పొట్టకు వచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితుందని రైతులు మండిపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ గోస పట్టించుకుని యూరియా కొరత లేకుండ చూడాలని రైతులు కోరుతున్నారు.