నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బీసీ జాతీయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేఈ నాగరాజు గౌడ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నాలుగు కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తుందని అలాగే గతంలో కొందరు ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టడం జరిగిందని అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మచ్చలేని నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేర్లను కర్నూలు నంద్యాల జిల్లాలకు పెట్టాలన ఆయన ప్రభుత్వాన్ని కోరారు