బుడమేరు వరద ముంపు సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. బుడమేరు వరద ముంపును శాశ్వతంగా నివారించాలని శనివారం విజయవాడలోని డాబా హోటల్ సెంటర్ వద్ద నిరసన చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని, దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, వంతెనలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బుడమేరు వల్ల తరచుగా వరదలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.