కలువాయి మండల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు , డైరెక్టర్ లుగా ఎన్నికైన వారు రైతులకు అందుబాటులో ఉండాలని వేంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.కలువాయి వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు గా గాడిపర్తి జగదల్ నాయుడు, డైరెక్టర్లు గ్రంది సురేష్ బాబు, నాలి పెంచలయ్య ప్రమాణ స్వీకారం చేసారు