వెలుగు వివోఏలకు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి కే. ధనలక్ష్మి డిమాండ్ చేశారు. పార్వతీపురంలో జరిగిన ఆ సంఘ జిల్లా మహాసభల్లో ఆమె ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వివోఏలు తొలగింపు అన్యాయం అన్నారు. రాజకీయ వేధింపులాపకపోతే ఉద్యమించడం తప్పదని హెచ్చరించారు.