రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కర్నూలులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి టిజి భరత్ అన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు నగరంలోని పాతబస్తీలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.కర్నూలులో కుల మతాలకతీతంగా ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతాయని, టీజీవీ గ్రూప్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు.