తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్. మద్దులేటి విద్యానగర్ లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనిఖీల్లో కుళ్ళిన పండ్లు, ఎక్కువ కాలం నిలువచేసిన బ్రెడ్లు, కాల పరిమితి దాటిన అనేక రకాల పిండి వంటకాలను గుర్తించామని అన్నారు. ఈ బేకరీ కి సంబంధించి మెయింటినెన్స్ పూర్తిగా సరిగా లేదని ఇలా ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.