అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, "ఇమామ్, మౌజామ్‌లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది" అన్నారు.