లోక్ అదాలత్ దావాలను పరస్పర సమ్మతితో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో డీ.ఎల్.ఎస్.ఏ అధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు లోక్ అదాలత్ ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్ లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 వేల పైచిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. పలువురి కేసులకు సంబంధించి అవార్డులను అందజేశారు.