ఎరువులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తీర్చాలంటూ వైసీపీ నాయకులు కోరారు. మంగళవారం సారవకోట మండల వైసీపీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. తక్షణమే మండలానికి ఎరువులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటే వారు కోరారు.