మైదుకూరు రూరల్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. 42 ఎర్రచందనం దుంగలతో పాటు గొడ్డలి, రాళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటు సీఐ శివశంకర్ ఎస్ఐ వినోద్ కుమార్ ఉన్నారు.