ఎఫ్ ఆర్ ఎస్ యాప్ తో గర్భిణీలు బాలింతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి అన్నారు. యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాకినాడ అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.