సారంగాపూర్ మండలం స్వర్ణ వాగులో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం బండరేవు తండాకు చెందిన కరాడే కీశ్వర్ (22) అనే యువకుడు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు అప్పారావుపేట్ నుండి స్వర్ణ డ్యామ్ కు వచ్చే వాగులో పడి మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.