నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట గ్రామంలో ఓ వివాహిత శనివారం పురుగులు మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటన పై ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లెంక లావణ్య అనే మహిళ గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది.. ఇటీవల నొప్పి ఎక్కువ కావడంతో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.