రాజపూర్ మండలం సమీపంలో 44వ జాతీయ రహదారిపై షాద్నగర్ వైపు నుండి జడ్చర్లకు వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బస్సు కింది భాగం లో పూర్తిగా ధ్వంసం కావడంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. అనంతరం ప్రత్యేక క్రేన్ సహాయంతో బస్సును ఘటన స్థలం నుండి తొలగించారు.