ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి బడేటి రాధాకృష్ణ, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు