సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ పాలేరు వాగులో గురువారం సాయంత్రం గల్లంతు అయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్డిఆర్ఎఫ్ బృందం అనంతగిరి పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఉపేందర్ ఆచూకీ లభించలేదన్నారు పెడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది.