రైతులకు బాసటగా సెప్టెంబర్ 9న ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం గోరంట్లలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రైతు పోరు పోస్టర్ గోడపత్రిక ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.