వాంకిడి మండల కేంద్రంలో రైతులు శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకొని పొలాల పండుగను ఘనంగా నిర్వహించారు. అదివారం ఉదయం బడగా పండుగ సందర్భంగా "జాగేయ్ మాతరి" అంటూ నినాదాలు చేస్తూ, వెదురు కర్రలను గ్రామం పొలిమేరలోని వాగు వద్ద పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి వదిలివేశారు. వివిధ రకాల చెట్ల కొమ్మలను అడవి నుంచి తీసుకొచ్చి, వాటి పొగను పీల్చితే రోగాలు నయమవుతాయని గ్రామస్థుల బలంగా విశ్వసిస్తారు.