ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బ తీసేందుకు దేశ వ్యాప్త కుట్ర జరుగుతోందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగస్వామి గా మారినట్లు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయనీ వాపోయారు. జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవడం దురదృష్టకరం అన్నారు. జగన్ ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్ప