అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో మెయిన్ రోడ్డు వద్ద దసరా మహోత్సవాల్లో భాగంగా దుర్గా శరన్నవరాత్రులకు రాట పాతి ఉత్సవ పనులను ప్రారంభించారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముహూర్త బలం ప్రకారం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు స్థానిక మహిళలంతా రాటపాటి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసామని వెల్లడించారు.