అనంతపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఈనెల 10న జరుగునున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో గురువారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు కళ్యాణదుర్గం అభివృద్ధికి సంబంధించిన నిధులను కేటాయించే అవకాశం ఉందన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెల్లి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.