లైంగిక వేధింపులపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యాదు కమిటీ లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు.. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం పై, మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రీ-మార్టియల్ కౌన్సిలింగ్ సెంటర్ పై అవగాహన కల్పించే పోస్టర్ లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ యొక్క బాధ్యత అన్నారు.