కోరుట్లలో సందడి వాతావరణం కోరుట్లలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. రేపు వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో వినాయక మండపాల్లో ప్రతిష్ఠించే వినాయక విగ్రహాలను తరలిస్తూ పిల్లలు, పెద్దలు అందరూ ఈలలు, డప్పులు కొడుతూ సందడి చేస్తున్నారు. మరో పక్క వీధి వ్యాపారులు చిన్న చిన్న వినాయక విగ్రహాలు, పూజ సామాన్లు, డప్పులు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు.