ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు, రవి తదితరులు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు, రవి ఇతర కార్మికులు మున్సిపల్ కమిషనర్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు నెల జీతం చెల్లించాలని, అలాగే కార్మికులకు అవసరమైన పనిముట్లు ఇవ్వాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.