చారిత్రాత్మకమైన గుత్తి కోటపై శుక్రవారం సాయంత్రం ఇంద్రధనస్సు కనువిందు చేసింది. గుత్తి కోట పై ఏర్పడిన ఇంద్రధనస్సును వీక్షకులు ఎంతో ఆసక్తితో తిలకించారు. సుమారు అరగంట పాటు ఇంద్రధనస్సు కోటపై కనిపించింది. ఇంద్రధనస్సును చూడడానికి జనాలు ఎంతో ఇష్టపడ్డారు. కోట కింద భాగం నుంచి జనాలు కోటపై ఏర్పడిన ఇంద్రధనస్సును వీక్షించారు.