Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
సీతారామపురం మండలం,నెమళ్ళదిన్నె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ షేక్ మస్తాన్ వలి బుధవారం సందర్శించారు. విద్యార్థులు తెలుగు, గణితశాస్త్రం అభ్యాసం పట్ల గల సామర్థ్యాలను పరిశీలించి పిల్లలతో కలిసి ఆంగ్ల పదాలతో ఆటలాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. మధ్యాహ్నం పెడుతున్న భోజన మెనూ అమలు తీరును పరిశీలించారు. ఉపాద్యాయులు విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు.