ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ యందు శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీటు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి పెంచడం వలన ఆక్సిజన సమృద్ధిగా అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.