మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కేంద్ర శివారు ఆకేరు వాగులో, ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వయంగా నడుపుతూ తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు, నెల్లికుదురు తహసిల్దార్ కే రాజు. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం మేరకు ఆకేరు వాగు వద్దకు చేరుకున్న తాసిల్దార్ రాజు మరియు సిబ్బందిని చూసి, ట్రాక్టర్లను అక్కడే వదిలేసి పరారయ్యారు ఇసుకాసురులు. దీంతో స్వయంగా తానే ట్రాక్టర్ను నడుపుతూ కార్యాలయానికి తరలించారు తహసిల్దారు రాజు.