ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కొత్తగూడెం సిపిఎం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రైతు రుణమాఫీ కోసం రైతులతో కలిసి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు రైతులు రుణభారం నుంచి బయటపడేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.