తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు కు భూసేకరణ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వికారాబాద్ జిల్లా నవపేట్ మండల పరిధిలోని చిట్టి గ్రామం పొలాల నుంచి రీజినల్ రింగ్ రోడ్ వెళ్తుండగా ఆ గ్రామానికి చెందిన రైతులు మాత్రం రీజినల్ రింగ్ రోడ్డుకు ఒక్క ఇంచ్ భూమి కూడా ఇవ్వమంటూ బుధవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. త్రిబుల్ ఆర్ లో ఉన్న సర్వే నెంబర్ల బోర్ రైతులు హెచ్ఎండిఏలో ఫిర్యాదు చేశారు. త్రిబుల్ ఆర్కు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని తెలిపారు.