పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీపై అభ్యంతరకర కొటేషన్ రాసి ఉండటంతో స్థానికులు మండిపడ్డారు. తమను ఉద్దేశించి ఈ ఫ్లెక్సీ పెట్టారంటూ దళిత సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఫ్లెక్సీని తొలగింపజేశారు.